telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

ముంబైలో భారీ వర్షాలు.. ముగ్గురు మృతి… చెరువులను తలపిస్తున్న..

3 died in mumbai for huge rains

ముంబయి లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. దీనితో మొన్నటివరకు ఎండల వేడికి అల్లాడిపోయిన జనాలకు ఈ కొత్త సమస్య తో సతమతమవుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జుహు, ములుంద్‌, వైలే పార్లే, థానే, వాసాయి, విరార్‌ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని ధరవి, పశ్చిమ ఎక్ప్‌ప్రెస్‌ హైవేతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఉష్ణ్నోగతలు పూర్తిగా పడిపోయాయి. లోకల్‌ ట్రైన్స్‌ యథావిథిగా కొనసాగుతున్నాయని పశ్చిమ రైల్వే పేర్కొంది.

ముంబయి విమానాశ్రయంలో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపింది. స్కైమేట్‌ ప్రకారం రానున్న 48 గంటల్లో ముంబయిలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాల కారణంగా షార్ట్‌ సర్య్కూట్‌ అయి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు ఇటువంటి కేసులు 9 నమోదయ్యాయి. దాదర్‌లోని పూల మార్కెట్‌లో గోడ కూడి ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో గత నాలుగు రోజులుగా కుంభ వర్షం కురుస్తోంది. వర్షానికి సంబంధించిన సంఘటనల్లో ఇద్దరు మృతి చెందారు.

Related posts