telugu navyamedia
సినిమా వార్తలు

జేమ్స్‌ బాండ్‌-25కు టైటిల్ ఇదే… అధికారిక ప్రకటన

డేనియ‌ల్ క్రెయిగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘”జేమ్స్‌ బాండ్‌” 25వ సినిమా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. కొద్ది సేప‌టి క్రితం చిత్ర టైటిల్‌ని బాండ్ చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ‘నో టైమ్‌ టు డై’ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 3, 2020న యూకేలో, ఏప్రిల్‌ 8, 2020న యూఎస్‌లో సినిమా విడుదల కాబోతున్నట్లు స్పష్టం చేసింది. మోట్రో గోల్డెన్‌ మేయర్‌, ఇయోన్ ప్రొడక్షన్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి గ‌తంలో ఈ చిత్ర టైటిల్‌కి సంబంధించి “ఏ రీజన్‌ టు డై’ ‘షట్టర్‌ హ్యాండ్‌’, ‘ఎక్లిప్స్‌’ పేర్లు చ‌క్క‌ర్లు కొట్టాయి. ఫైన‌ల్‌గా ‘నో టైమ్‌ టు డై’ అనే పేరు ఫైన‌ల్ చేశారు. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు మళ్లీ బాండ్‌ను విధుల్లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే ఈ చిత్ర‌ కథ ఉండబోతోందని స‌మాచారం. బాండ్ 25 చిత్రానికి ఆ మ‌ధ్య ప‌లు స‌మ‌స్య‌లు త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. సెట్‌లో ప‌రుగెత్తుతున్న‌ప్పుడు డేనియ‌ల్ కాలు మ‌డత‌ప‌డి కింద ప‌డిపోవ‌డంతో ఆయ‌న చీల‌మండ‌కి గాయం అయింది. దీంతో ఈ మూవీ కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డింది. అదీ కాక‌ సెట్‌లో స్టంట్ స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తుండ‌గా మూడు సార్లు పేలుడు సంభ‌వించింది. దీంతో సెట్‌కి సంబంధించిన ఫ‌ర్నీచ‌ర్ మొత్తం అగ్నికి ఆహుత‌య్యాయి. సెట్ బ‌య‌ట నిల‌బ‌డిన ఓ వ్య‌క్తికి స్వ‌ల్ప గాయాలైన‌ట్టు కూడా తెలుస్తుంది. అప్పుడు కూడా చిత్ర షూటింగ్‌కి కొద్ది రోజుల పాటు బ్రేక్ ప‌డింది. ఈ చిత్రం విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

Related posts