telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మోడీ విదేశీ పర్యటనలకు .. 255 కోట్ల ఖర్చు..

special flight for modi tours

నరేంద్ర మోదీ విదేశీ ప్రయాణాల కోసం ఎంత ఖర్చు చేశారో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రత్యేక విమానాల కోసం రూ. 255 కోట్లు వెచ్చించినట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్…2016-19 సంవత్సరాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చార్టెర్డ్ విమానాల ఖర్చు సుమారు రూ. 255 కోట్లని రాజ్య సభలో లిఖితపూర్వకంగా తెలిపారు. 2016-17 సంవత్సరంలో రూ.76.27 కోట్లు, 2017-18లో రూ.99.32 కోట్లు, 2018-19 సంవత్సరంలో రూ. 79.91 కోట్లు ఖర్చయినట్లు ఆయన వివరించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రధాని మోదీ విదేశ పర్యటనకు ఖర్చులు అందాల్సి ఉందని తెలిపారు. విశేషమేమిటంటే.. 2016-2018 సంవత్సరాల మధ్య నరేంద్ర మోదీ… విదేశీ నేతలతో… హాట్ లైన్ సంభాషణల కొరకు సుమారు రూ. 3 కోట్ల ఖర్చయిందని తెలిపారు.

ప్రభుత్వ విధానం ప్రకారం, మన దేశ ప్రధాని మన వైమానిక దళ విమానాలలో, హెలికాప్టర్లలో అధికారికంగా పర్యటిస్తే, అవన్నీ ఉచితమే. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గా ఎంపికయిన రోజు నుంచి (2014) ఇప్పటివరకు 42 ఫారెన్ ట్రిప్పులలో 84 దేశాలు పర్యటించారు. కేవలం 2015-16 సంవత్సరాల మధ్యకాలంలో 24 దేశాలలో పర్యటించారు మోదీ. ఈ గణాంకాల విడుదల కావడంతో ప్రతిపక్ష నేతలు ఎలా విమర్శిస్తారో చూడాలి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్యాప్ లేకుండా పర్యటనలు చేసి ఎన్నో దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట వేశారు. చెప్పాలంటే.. బహ్రెయిన్ లో పర్యటించనున్న మొట్టమొదటి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచారు.

Related posts