telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘డియర్ కామ్రేడ్’ రికార్డుల మోత

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన ‘డియర్ కామ్రేడ్’ జూలై 26, 2019న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను తీసినా, ఒకేసారి తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. లవ్, పెయిన్, ఎమోషన్స్, యాంగర్… ఈ నాలుగింటి సమ్మిళితంగా ‘డియర్ కామ్రేడ్’ మూవీ తెరకెక్కింది. అయితే… అప్పట్లో అనివార్య కారణాల వల్ల హిందీ వెర్షన్ విడుదల కాలేదు. దాంతో 2020 జనవరి 19న ‘డియర్ కామ్రేడ్’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. అప్పటి నుండీ ఈ రోజు వరకూ ఆ చిత్రానికి 250 మిలియన్ వ్యూస్ దక్కాయి. అంతేకాదు… 2.9 మిలియన్ లైక్స్ లభించాయి. విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ హిందీలో రీమేక్ కావడంతో అక్కడ కూడా చక్కని గుర్తింపు లభించింది. ఇప్పుడు ‘లైగర్’ మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Related posts