telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కూలీలకు .. 25 రూపాయలలో నెల పాస్ .. : రైల్వేశాఖ

25 rupees railway pass to labor

ట్రైన్‌లలో ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం ప్రయాణం చేసే కూలీలకు రైల్వేశాఖ ఇజ్జత్ రైల్వే పాసులను ఇస్తుంది. రోజువారి కూలీ పనులు చేసుకునేవారు వారి ఆదాయ సర్టిఫికెట్ ఆధారంగా ఎంపీ ఇచ్చే రైల్వే పాసును పొంది నెలకు రూ.25లు చెల్లించినైట్లెతే నెలరోజుల పాటు ప్రతిరోజు రానుపోను 300 కిలోమీటర్ల వరకు ఏ ట్రైన్‌లో అయినా (ఫ్యాసింజర్, సూపర్ ఫాస్ట్) ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ట్రైన్‌లలో మంచినీళ్లు, సమోసాలు విక్రయించే వారు. పూలు అమ్ముకునే వాళ్లు, బూట్ పాలిస్ చేసే వారు, చిన్నిచిన్న వ్యాపారాలు చేసుకునే వారు, పండ్ల వ్యాపారులు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసేవారు, పల్లీలు, రోజువారి పనులు చేసుకునే సుతారి, పెయింటింగ్, ఇతరత్ర కూలీపనులకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఇజ్జత్ పాసులు పొందవచ్చు వారికి రైల్వేశాఖ పాసులు అందింస్తుంది.

రైల్వే ఇజ్జత్ పాస్ కావాలనుకునే వారు గ్రామ సర్పంచ్ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవలి. తెల్ల రేషన్ కార్డు, తహసీల్దార్ ధ్రువీకరించిన ఆదాయ సర్టిఫికెట్‌ను తీసుకుని పార్లమెంట్ సభ్యుడి క్యాంపు కార్యాలయానికి రావాలి. అక్కడ కార్యాలయ సిబ్బంది దరఖాస్తును ఇస్తారు. అది పూర్తి చేసి రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు అతికించి ఇచ్చినైట్లెతే వాటిని పరిశీలించి పార్లమెంట్ సభ్యుడు తన లెటర్ హెడ్ మీద సర్టిఫికేట్ అందజేస్తారు. ఇది రెండు సంవత్సరాల పాటు పనికి వస్తుంది. ఈ రెండేండ్లలో ప్రతి నెలగాని, మూడు నెలలకోకసారి గాని ఆరు నెలలకొకసారిగాని నెలకు రూ.25 ల చొప్పున రైల్వే స్టేషన్‌లో చెల్లించి ఇజ్జత్ పాసు పొందవచ్చు.

Related posts