• Home
  • Trending Today
  • కేవలం ఆకులకే పాతిక లక్షల బడ్జెట్…!?
Trending Today సినిమా వార్తలు

కేవలం ఆకులకే పాతిక లక్షల బడ్జెట్…!?

aravinda sametha got positive talk with premier show

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరమీదకు రానున్న ‘అరవింద సమేత’ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే జంటగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. “అరవింద సమేత” సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆడియో విడుదల వేడుక ఎప్పుడు జరుగుతుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20వ తేదీన భారీ ఎత్తున ఆడియో విడుదల చేయాలనీ దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ డైరెక్ట్ గా ఆన్ లైన్ లో పాటలను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. దానికి బదులుగా అక్టోబర్ మొదటి వారంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్.

ఇదిలా ఉండగా చిత్రంలోని ఆకుల బడ్జెట్ గురించే ఇప్పుడు అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇందులో ఒక సీక్వెన్స్ కోసం పూర్తిగా ఆకులతో నిండి ఉన్న ఒక చెట్టు, మొద్దుబారిన మరో చెట్టు అవసరమయ్యాయట. కానీ సహజంగా కనిపించేవి ఎక్కడా దొరకలేదట. దీంతో ప్లాస్టిక్ ఆకులను బెంగుళూరు నుంచి తెప్పించారట. దీనికి అక్షరాలా పాతిక లక్షలు ఖర్చయిందట. గతంలో అత్తారింటికి దారేదిలో చిత్రంలో కామెడీ బిట్ కోసం ఆకులను వాడుకున్నాడు త్రివిక్రమ్. మరి ఇందులో దేనికి వాడుకుంటున్నాడు… ఆకులకే పాతిక లక్షలా అంటూ నోరెళ్ళబెడుతున్నారు ప్రేక్షకులు.

ఇటీవల విడుదలైన టీజర్ కు ఎన్టీఆర్ అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ టీజర్ సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా చేసింది. ఫామిలీ అండ్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రయూనిట్ సిద్ధమవుతోంది. తమన్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేకార్షణగా నిలవనుంది. ఈ చిత్రంలో సునీల్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Related posts

ఆ సినిమా షూటింగ్ నుంచి రణ్వీర్ సింగ్ ను గెంటేశారట…!?

jithu j

క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ‌లో… విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క్రాంతిమాధ‌వ్ చిత్రం.. 

jithu j

సెప్టెంబ‌ర్ 20న దేవ‌దాస్ ఆడియో పార్టీ..

jithu j

Leave a Comment