telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

2019 గూగుల్ టాప్ ట్రేడింగ్ భారత ప్రముఖులు వీరే…!

google office

ఈ ఏడాదిలో భారత టాప్ ట్రేడింగ్ వ్యక్తుల జాబితాను తాజాగా గూగుల్ విడుదల చేసింది. ఇండియాలో నెటిజన్లు 2019లో వీరి గురించే ఎక్కువగా వెతికినట్లు పేర్కొంది. ఈ జాబితాలో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మొదటి స్థానంలో నిలిచారు. టాప్ 10 ట్రేడింగ్ పర్సనాలిటీస్ వివరాలు ఇలా ఉన్నాయి…

1. అభినందన్ వర్థమాన్
ఈ ఏడాది వీర్ చక్ర అవార్డు సొంతం చేసుకున్న అభినందన్… పాక్ భూభాగంలో కుప్పకూలిన యుద్ధవిమానం వల్ల ఆ దేశ ఆర్మీకి చిక్కారు. రెండు రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చారు. 2019లో ఎక్కువ ట్రేడింగ్ అభినందన్ అయ్యారు. దీంతో మొదటి స్థానంలో నిలిచారు.

2. లతా మంగేష్కర్
ప్రముఖ గాయని లతా మంగేస్కర్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. న్యుమోనియాతో బాధపడుతూ ఈ 90 ఏళ్ల లెజండరీ గాయని ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 28 రోజులు చికిత్స పొందారు. అనంతరం కోలుకోని తిరిగి ఇంటికి చేరారు. ఈ నేపథ్యంలో లతా మంగేస్కర్ ట్రేడింగ్‌లో నిలిచారు.

3. యువరాజ్ సింగ్
భారత క్రికెట్‌లో ప్రత్యేక స్థానం ఉన్న క్రికెటర్ యువరాజ్ సింగ్. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన యువీ ఈ ఏడాది క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. యువరాజ్ గురించి చాలా మంది నెటిజన్లు సెర్చ్ చేయడంతో ట్రేడింగ్‌లో దూసుకోచ్చాడు. మోస్ట్ ట్రేడింగ్ పర్సనాలిటీ జాబితాలో మూడో స్థానం దక్కించుకున్నాడు.

4. ఆనంద్ కుమార్
బీహార్‌కు చెందిన ప్రముఖ గణిత వేత్త ఆనంద్ కుమార్ ఈ లిస్ట్‌లో నాల్గో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’ మూవీ ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగానే తెరకెక్కింది. దీంతో ఆనంద్‌కు గూగుల్ మోస్ట్ ట్రేడింగ్ పర్సనాలిటీ జాబితాలో చోటు దక్కింది.

5. విక్కీ కౌశల్
బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమా అతడ్ని భారత్ ట్రేడింగ్ పర్సనాలిటీస్ గూగుల్ జాబితాలో ఐదో స్థానంలో నిలబెట్టింది.

6. రిషబ్ పంత్
భారత యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. 2019లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన రిషబ్ ట్రేడింగ్‌లో నిలిచాడు.

7. రాను మొండల్
బెంగాల్ రైల్వే స్టేషన్‌లో రాను పాడిన పాట నెట్టింట వైరల్ కావడంతో ఆమె రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయిపోయింది. దీంతో మొండల్ గురించి చాలా మంది నెటిజన్లు సెర్చ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె గూగుల్ మోస్ట్ ట్రేడింగ్ ఇండియన్ పర్సనాలిటీస్ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది.

8. తార సూతారియా
ఈ ఏడాది విడుదలైన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ చిత్రంతో బాలీవుడ్ వెండితెరకు పరిచయమైన తార సూతారియా ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

9. సిద్ధార్థ్ శుక్లా
బుల్లితెర నటుడు, బిగ్ బాస్ 13 కంటెస్టెంట్ సిద్ధార్థ్ శుక్లా గూగుల్ మోస్ట్ ట్రేడింగ్ పర్సనాలిటీస్ లిస్ట్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

10. కోయెనా మిత్రా
బుల్లితెర నటి, బిగ్ బాస్ 13 కంటెస్టెంట్ అయిన బుల్లితెర కోయెనా మిత్రాకు ఈ జాబితాలో పదో స్థానం దక్కింది.

అలాగే 2019లో ఇండియాలో ట్రేడింగ్ సెర్చ్‌లలో టాప్ 10లో నిలిచినవి….
1. క్రికెట్ వరల్డ్ కప్
2. లోక్ సభ ఎన్నికలు
3. చంద్రయాన్-2
4. కబీర్ సింగ్ (బాలీవుడ్ మూవీ)
5. అవెంజర్స్: ఎండ్ గేమ్
6. అర్టికల్ 370
7. నీట్ ఫలితాలు
8. జోకర్ (హాలీవుడ్ మూవీ)
9. కెప్టెన్ మార్వెల్
10. పీఎం కిసాన్ యోజన పథకం.

Related posts