telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అధికారం కోసం… సాంప్రదాయ నరబలి…

2014 election scam costs 3 lives

సహజంగా సినిమాలలో చూసినట్టుగా రాజకీయాలలో అధికారం కోసం సామాన్యుల ప్రాణాలను బలిస్తుంటారు. అందులో వారి రహస్యాలు తెలిసిన వారే ముందుంటారు. అలా అధికారం సంపాదించినట్టు బోలెడన్ని చిత్రాలలో ఇప్పటివరకు చూసిఉంటాము. కానీ, బీజేపీ కూడా 2014లో విజయం కోసం అదే చేసిందని తాజా వార్తలు తేటతెల్లం చేస్తున్నాయి. గత ఎన్నికలలో విజయం కోసం ఈవీఎం హ్యాకింగ్ చేసిన బీజేపీ గురించి తెలిసిన వారు ముగ్గురు మూడు కారణాలతో చంపబడ్డారు. కారణాలు సృష్టించినవే అని తెరవెనుక నిజాలు తెలియజేస్తున్నాయి. కానీ అధికారంలో ఉన్నవారికి శిక్ష విధించడం ఎవరి సాధ్యం, అంటే, రాష్ట్రపతికి ఆ హక్కు ఉంటుంది. మరి రాష్ట్రపతి దీనిపై విచారణ జరిపి, అది వారి నివేదిక ఇచ్చేసరికే మరో రెండు తరాలు గడిచిపోతాయి. ఈ లోపు ఎన్నికలకు మరో ఆరు నెలలు కూడా లేవు. ఇప్పుడు దీనిపై చర్యలు ఎవరు తీసుకోవాలి… ఎన్నికల సమయం కాబట్టి ప్రజలే ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుతుంది. అదొక్కటే దారి, ఆ దారిలో న్యాయం జరిగేనా లేదా అనేది ఎన్నికల ఫలితాలలోనే తేలనుంది. అయితే ఇక్కడ మరో సమస్య కూడా తలెత్తుతుంది…అధికారం చేతిలో లేనప్పుడే ఇంత చేస్తే, ఇప్పుడు అధికారం చేతులలో ఉంచుకొని దానిని ఇంకెంత సులువుగా దుర్వినియోగం చేయొచ్చు.. అన్న విషయం మాత్రం జవాబు లేనిదే.

ఇక తాజాగా వార్తా మాధ్యమాలలో వస్తున్న సమాచారం ప్రకారం, ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్, ‘లంకేశ్‌ పత్రిక’ అనే కన్నడ పత్రికకు ఎడిటర్‌, తండ్రి వారసత్వంగా పత్రిక బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఢిల్లీలో, బెంగళూరులో ప్రధాన పత్రికలకు జర్నలిస్టుగా పని చేశారు. ఛాందసవాద భావాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నక్సలైట్ల సానుభూతిపరురాలిగా ఆరోపణలను ఎదుర్కొన్నారు. 2017 సెప్టెంబరు 5న బెంగళూరులోని ఆమె నివాసం బయట గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కాల్చి చంపారు. ఆమె హత్య దేశవ్యాప్త ఆందోళనకు కారణమైంది. హిందూ అతివాదుల దాడిగా(చిత్రీకరించారు) ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా ఆమె హత్యకు అసలు కారణం ఈవీఎంల ట్యాంపరింగ్‌ కుంభకోణాన్ని వెలికితీసేందుకు ప్రయత్నించడమేనని లండన్‌ విలేకరుల సమావేశంలో సయీద్‌ సుజా అనే వ్యక్తి ఆరోపించారు. ఆమె ఈవీఎం హ్యాకింగ్‌ మీద ఆర్‌టీఐ దరఖాస్తు వేయడంతో ప్రభుత్వం అప్రమత్తమై ఆమెను అంతమొందించిందని చెప్పారు.

గోపీనాథ్‌ ముండే మహారాష్ట్ర బీజేపీలో ముఖ్యనేత. ప్రమోద్‌ మహాజన్‌కు బావ. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారానికి రాగానే ముండే కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటికి ఆయన మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తిరుగులేని నేతగా ఉన్నారు. 2014 జూన్‌ 3న ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఢిల్లీలోని తన అధికార నివాసం నుంచి తెల్లవారు జామున కారులో విమానాశ్రయానికి వెళుతుండగా, ట్రాఫిక్‌ సిగ్నల్‌ దాటుతున్న సమయంలో పక్క నుంచి వచ్చిన క్యాబ్‌ సరిగ్గా మంత్రి కారును ఆయన కూర్చున్న వెనుక సీటు ప్రాంతంలో ఢీకొంది. రెండు కార్లు పెద్దగా డ్యామేజీ కాలేదు. గోపీనాథ్‌ ముండే మాత్రం మరణించారు. ఆయన గుండెపోటుతో మరణించారని తేల్చారు. మరణించే నాటికి కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి కనీనం రెండు వారాలు కాలేదు. గోపీనాథ్‌ 2014 ఈవీఎం హ్యాకింగ్‌ కుంభకోణంలో పాత్రధారి అని, విషయం బయట పెడతానని బెదిరించడం వల్ల హత్యకు గురయ్యారని సయ్యద్‌ సుజా ఆరోపించారు.

ఇక మహ్మద్‌ తంజీల్‌ అహ్మద్‌ బి.ఎస్.ఎఫ్ అధికారి. 2009లో ఎన్‌ఐఏ ఏర్పాటైనప్పటి నుంచీ అందులో ఉన్నారు. అప్పటి నుంచి ఎన్‌ఐఏ చేపట్టిన ప్రతీ పెద్ద కేసులో ఆయనకు భాగస్వామ్యం ఉంది. ఉర్దూ పర్షియన్‌ భాషల్లో ప్రావీణ్యం ఉండటంతో ఉగ్రవాదుల వేటలో తంజీల్‌ కీలక అధికారిగా అవతరించారు. ఉగ్రవాది యాసీన్‌ భత్కల్‌ కేసును ఛేదించిన ఘనత ఈయనదే. 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అనుమానాస్పదంగా గోపీనాథ్‌ ముండే చనిపోవడంతో ఆ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. 2016 ఏప్రిల్‌ 2న యూపీలో మేనకోడలి వివాహానికి హాజరై ఢిల్లీకి తిరిగి వస్తుండగా బుల్లెట్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వ్యాగనార్‌ మీద కాల్పులు జరిపారు. కారు నడుపుతున్న ఆయన భార్య, పిల్లల సమక్షంలోనే కన్ను మూశారు. తంజీల్‌ శరీరంలో 22 బుల్లెట్లు దిగాయి. గోపీనాథ్‌ ముండే మరణానికి సంబంధించిన కేసును తంజీల్‌ దర్యాప్తు చేశారని, ముండే హత్యకు సంబంధించిన కొన్ని రహస్యాలు తెలిసినందుకే తంజీల్‌ను హత్య చేశారని సయ్యద్‌ సుజా ఆరోపించారు. ఈ మూడు సాంప్రదాయ హత్యలు, అంటే అధికారం కోసం ఒక పార్టీ చేసిన హత్యా రాజకీయం. ఆ అధికారుల కంటే, ఓ జర్నలిస్ట్ కంటే ఈ నేతలు గొప్పవారేమి కాదు, దేశానికి వాళ్ళవల్ల ఒరిగింది ఏమిలేదు. అటువంటివారిని ఉపేక్షించవచ్చా లేదా అనేది రాబోవు ఎన్నికలలో ప్రజలు చెప్పే తీర్పును బట్టి ఉంటుంది.

Related posts