• Home
  • వార్తలు
  • మాజీ మంత్రులకు మరణశిక్ష విదించిన కోర్టు… కొందరికి జీవిత ఖైదు…
Trending Today క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

మాజీ మంత్రులకు మరణశిక్ష విదించిన కోర్టు… కొందరికి జీవిత ఖైదు…

2004 Grenade Attack Bangladesh Ex Ministers and Ex PM's Son

గ్రెనేడ్ దాడి కేసులో భాగంగా విచారణ జరిపిన స్థానిక కోర్టు బంగ్లాదేశ్ మాజీ మంత్రి లుత్ ఫోజ్మన్ బాబర్ కు మరణశిక్షను ఖరారు చేసింది. మాజీ మంత్రి ఫోజ్మన్ తో పాటుగా మరో 18 మందికి ఆ కేసులో మరణశిక్షను ఖరారు చేశారు. అయితే ఇదే కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్ రెహ్మాన్ కు జీవిత ఖైదు శిక్ష విధించింది… 2004 సంవత్సరం ఆగస్టు 21 వ తారీఖున జరిగిన గ్రేనేడ్ దాడిలో 24 మంది మరణించగా సుమారు 500 మంది గాయపడ్డారు…

అయితే ప్రస్తుత బంగ్లా ప్రధాని హసీనా ను టార్గెట్ చేస్తూ దాడికి పాల్పడ్డారు… అయితే దాడి సమయంలో ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే పేలుడు వల్ల హసీనా పాక్షికంగా వినికిడిని కోల్పోయారు. బహిరంగ సభ కోసం వచ్చిన షేక్ హసీనా ట్రక్కు నుంచి దిగుతున్న సమయంలో దాడి చేశారు… ఇదే కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ సలామ్ పింటూకు కూడా కోర్టు మరణశిక్షను ఖరారు చేశారు. బీఎన్పీ పార్టీలో కార్యదర్శిగా చేసిన హరిస్ చౌదరీకి జీవితశిక్షను వేశారు. గ్రేనేడ్ దాడి కేసులో మరో 11 మంది ప్రభుత్వ అధికారులకు కూడా శిక్ష ఖరారైంది…

Related posts

తెలంగాణా ఆవిర్భావ సభ పైనే అందరి దృష్టి

admin

రూటు మార్చిన నితీష్ !

admin

మహిళల భద్రత కోసం …కేంద్రం భారీ నిధులు…

chandra sekkhar

Leave a Comment