• Home
  • Trending Today
  • రజిని కొత్త రికార్డు…9 గంటలలో కోటిన్నర…
Trending Today వార్తలు సామాజిక సినిమా వార్తలు

రజిని కొత్త రికార్డు…9 గంటలలో కోటిన్నర…

2.O

లైకా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం ‘2పాయింట్ ఓ’ చిత్రం టీజర్ వినాయకచవితి సందర్భంగా విడుదల చేశారు. అయితే విడుదలైన తొమ్మిది గంటలలోనే కోటిన్నర మంది వీక్షించారు. అంటే ఆ చిత్రంపై ప్రేక్షకులలో ఎంతటి ఆసక్తి ఉన్నది అర్ధం అవుతుంది. రోబో చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ కూడా ప్రధాన పాత్రలో నటించారు.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ ను కూడా దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దిన వైనాన్ని సినీ అభిమానులు ఈ వ్యూస్ తో స్పష్టం చేశారు. టీజర్ తమిళ, తెలుగు, హిందీ బాషలలో ఏకకాలంలో విడుదల చేశారు. తమిళంలో 5.9 మిలియన్లు, తెలుగులో 3. 7 మిలియన్లు, హిందీలో 5.1 మిలియన్లు మొత్తం కలిపి కోటిన్నర వ్యూస్ అని నిర్మాణ సంస్థ లైకా వెల్లడించింది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు.


 

Related posts

వైఎస్సార్ పార్టీ ట్రాప్ లో శ్రీ రెడ్డి

admin

శివాజీ పిచ్చివాడిలా మాట్లాడుతున్నారు: బీజేపీ

madhu

“పెట్ట”కు 3 మిలియన్ వ్యూస్… ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే…

vimala t

Leave a Comment