telugu navyamedia
news Telangana trending

హైదరాబాద్ : …భారీ వర్షాలకు … హుస్సేన్ సాగర్ గట్టుదాటుతుంది..

huge rain in hyderabad troubles normal life

ఎప్పుడు బిజీగా ఉండే నగరాలలో వర్షం తెచ్చే తిప్పలు అంతాఇంతా కాదు. ఇక అదేనగరాలలో కాస్త సమస్య ఉంటె దాని వల్ల వచ్చే ఇబ్బందులు కూడా అనేకం. అదేస్థితిలో ఉంది హైదరాబాద్ నగరం, భారీ వర్షాలు ముంచెత్తుతుండటంతో ఇప్పటికే జలమయమైన రోడ్లపైకి హుసేన్ సాగర్ కూడా వచ్చేట్టుగా ఉంది. గత నెల రోజులుగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. తాజాగా శుక్రవారం సాయంత్రం కూడా హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం అతలాకుతలం చేసింది.

అమీర్ పేట, జూబ్లీహిల్స్, బేగంపేట, మియాపూర్, ఎల్బీనగర్, తార్నాక, ఉప్పల్, మల్కాజ్ గిరి, కుషాయిగూడ, ఆల్వాల్ ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీల్లో నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది.

Related posts

కేసీఆర్‌ అన్ని సబ్జెక్టులు ఫెయిల్‌: లక్ష్మణ్‌

vimala p

రేపిస్ట్ లపై కేసులు పెట్టడం ఎందుకు ? : అలనాటి స్టార్ హీరోయిన్

vimala p

అమిత్ షా టీడీపీకి తలుపులు మూసేశారు: కన్నా

vimala p