telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

వీళ్ళు స్నానం చేయడంలో కూడా ట్రెండ్ సృష్టిస్తున్నారు… వీడియో వైరల్ !?

Viethnam

వియాత్నం, హనోయ్ : బాత్‌రూంలు, స్విమ్మింగ్ ఫూల్‌లో సాధారణంగా అందరూ స్నానం చేస్తారు. కానీ ఓ ఇద్దరు యువకులు మాత్రం ద్విచక్ర వాహనంపై నగరమంతా చక్కర్లు కొడుతూ.. బండిపైనే స్నానం చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలోని దృశ్యాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు అర్ధనగ్నంగా ఓ బండిపై వెళ్తూ.. వారి మధ్యలో బకేట్‌ను పెట్టుకుని స్నానం చేశారు. వెనకాల కూర్చున్న యువకుడు నీళ్లు పోస్తుంటే.. బండి నడిపించే వ్యక్తి సబ్బు రాసుకున్నాడు. ఈ దృశ్యాలను రోడ్డుపై ఉన్నవారు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. పోలీసుల దృష్టికి ఈ వీడియో వెళ్లడంతో.. బండి నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ ఇద్దరు యువకులను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బండిపై వెళ్తూ.. రోడ్డుపై స్నానం చేసినందుకు పోలీసులు వారికి ఫైన్ వేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Related posts