telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చనిపోయిన డాల్ఫీన్ ను కోసి చూడగా…!!

Dolphin

ఫ్లోరిడాలోని ఫోర్ట్ మేయర్స్ బీచ్‌ ఒడ్డుకు చనిపోయిన ఓ డాల్ఫిన్‌ కొట్టుకు వచ్చింది. ఆ కళేబరంను కోసి చూడగా పొట్టమొత్తం మానవ వ్యర్థాలతోనే నిండిపోయి ఉంది. అలాగే రెండు అడుగుల ప్లాస్టిక్ షవర్ గొట్టం కూడా ఉండడం  షాక్‌కు గురిచేసింది. ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమీషన్ ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. కాగా, నెల వ్యవధిలోనే ఇది రెండో ఘటనగా అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 23వ తేదీన కూడా ఓ చిన్న డాల్ఫీన్ ఇలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు తినడంతో చనిపోయి ఒడ్డుకు కొట్టుకువచ్చిందని తెలిపారు. ప్లాస్టిక్ భూతం మానవాళి మనుడగకే కాదు అటు జలచరాల మనుగడను కూడా ప్రశ్నార్థంగా మార్చేస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు భారీ మొత్తంలో సముద్రాలు, నదుల్లో కలవడం జలచరాలు వాటిని ఆహారంగా తీసుకోవడంతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నాయి. ఈ వ్యర్థాల వల్ల ఇప్పటికే చాలా జలచరాలు నశించాయని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే జలచరాల మనుగడ ప్రశ్నార్థం అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

Related posts