• Home
  • Trending Today
  • “2.ఓ” 3డీ టీజర్… థియేటర్ లో ఉచితంగా వీక్షించిన ప్రేక్షకులు…
Trending Today వార్తలు సామాజిక సినిమా వార్తలు

“2.ఓ” 3డీ టీజర్… థియేటర్ లో ఉచితంగా వీక్షించిన ప్రేక్షకులు…

Rajinikanth 2.0 trailer shankar ROBOT-2 Records

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 500 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం “2.ఓ”. ఈ చిత్రం విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానులు కళ్ళు కాచేలా ఎదురు చూస్తున్నారు. 3డి కెమెరాలతో చిత్రీకరించడం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమైనప్పటికీ అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది చిత్రబృందం.

వినాయక చవితి వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న ఈ సినిమా 3డీ టీజర్‌ను విడుదల చేశారు. థియేటర్లలో ఈ టీజర్‌ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే థియేటర్లలో “2ఓ” 3డీ టీజర్ ను వీక్షించాలనుకునే వారు 90999 49466 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి ఉచిత టికెట్ ను పొందండి అంటూ యూనిట్ ప్రకటించింది. పీవీఆర్, సత్యం థియేటర్లలో ఈ 3డి టీజర్ ను ప్రదర్శించారు. దీనికి మంచి స్పందనే వచ్చింది. చాలా మంది థియేటర్ లలో ఈ చిత్రం 3డి టీజర్ ను వీక్షించి ఆనందపడ్డారు.

 


అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ సంవత్సరం నవంబర్ లో విడుదల కానుంది. చాలారోజుల క్రితమే సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికి సినిమా విడుదల కాలేదు. సినిమా విడుదలైతే ప్రేక్షకులకు విజువల్ వండర్ లా ఉంటుంది. అందుకే సినిమా విడుదల గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు రజినీ, శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన “రోబో” సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

Related posts

సొంత డబ్బింగ్ తో ఆకట్టుకుంటున్న హీరోయిన్లు..

admin

తెలంగాణ నిధులు..వెనక్కి…కేంద్రం..

chandra sekkhar

విశ్వమంతా నీవై ….!

chandra sekkhar

Leave a Comment