telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సింగరేణి కార్మికులలో ఆనందోత్సవాలు .. ముందస్తు దసరా ఉత్సవాలు..

1lakh bonus to singareni employees

తాజా కేసీఆర్ నిర్ణయంతో మంచిర్యాల సింగరేణిలో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనతో సింగరేణి వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. సింగరేణి సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చిన లాభాల్లో 28శాతం వాటాను కార్మికులకు చెల్లించనున్నట్లు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. రూ.1765కోట్ల లాభాలు రాగా అందులో 28శాతం వాటా లాభాల కింద ప్రతీ కార్మికునికి చెల్లించనున్నట్లు, తద్వారా ప్రతీ కార్మికుడు రూ.1,00,899లను పొందనున్నట్లు ఆయన తెలిపారు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని సింగరేణి కార్మికులకు దసరా కానుక కింద ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు.

2013-14 ఆర్థిక సంవత్సరం నుండి మొదలుకొని గత ఐదు సంవత్సరాలుగా సింగరణి సంస్థ లాభాలు గడిస్తుందని తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో బోనస్‌ కింద రూ.13,500 చెల్లించగా, ప్రతీ సంవత్సరం వాటా పెంచడంతో పాటు లాభాలు కూడా పెరుగుతుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం వరకు సింగరేణి కార్మికులు రూ.1లక్ష వరకు లాభాల కింద వాటా పొందుతున్నారని, అదేవిధంగా 2013-14 ఆర్థిక సంవత్సరం నుండి బొగ్గు ఉత్పత్తిలో కూడా ఘనణీయంగా ఉత్పత్తి సాధించిందని తెలిపారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన సీఎం ప్రకటనతో సింగరేణి అంతటా కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు.

Related posts