telugu navyamedia
విద్యా వార్తలు

వ్యవసాయ డిగ్రీ తో కూడా.. కోటి జీతం..

another notification in ap for anm
అన్ని రంగాలలో ముందుండాలి అనే అపోహలో ఎంతసేపు ఉన్నా టెక్నాలజీ అంటూ పరుగులు పెడుతున్నారు. అదే స్థాయిలో వ్యవసాయ రంగం కూడా నిర్లక్ష్యానికి గురిఅవుతుంది. అందుకే వ్యవసాయ రంగంలో డిగ్రీ చేసిన విద్యార్థులకు గతంలో ఉద్యోగాలు చాలా తక్కువగా ఉండేవి. ప్రపంచీకరణ, విదేశీ కంపెనీల రాక సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. తాజాగా పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)కి చెందిన ఓ యువతి భారీ ప్యాకేజీ దక్కించుకున్నారు. అంతర్జాతీయ ఎరువులు, విత్తనాల కంపెనీ మోన్ శాంటోలో ఏడాదికి రూ.కోటి వేతనంతో  ప్రొడక్షన్ మేనేజర్ ఉద్యోగాన్ని పొందారు. 
కవిత ఫమన్ ఎల్పీయూలో ఎమ్మెల్సీ అగ్రికల్చర్(ఆగ్రోనమీ) చివరిక సంవత్సరం చదువుతున్నారు. మోన్ శాంటో సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ ప్రక్రియకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాతపరీక్షతో పాటు ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులయ్యారు. దీనితో మోన్ శాంటో భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చింది. ఉద్యోగ విధుల్లో భాగంగా కెనడాలోని మోన్ శాంటో విభాగంలో కవిత పనిచేయాల్సి ఉంటుంది. 
ఇటీవల మోన్ శాంటోను జర్మన్ ఎరువుల దిగ్గజం బేయర్స్ కొనుగోలు చేసింది. ఈ విషయమై కవిత స్పందిస్తూ.. మోన్‌శాంటోలో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. తన కల నిజమైనట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఇక ఎల్పీయూ డైరెక్టర్ సింగ్ మాట్లాడుతూ.. ఓ వ్యవసాయ విద్యార్థికి ఇంత భారీ ప్యాకేజీ రావడం ఇదే తొలిసారని అన్నారు.

Related posts