telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

మోక్షగుండం విశ్వేశ్వరయ్య 159వ జయంతి .. ఇంజనీర్ల దినం ..

159 birthday of mokshagundam visvesvaraya

దేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో తిరుమల నుంచి తిరుపతికి ఘాట్‌రోడ్డు సహా ఎన్నో రిజర్వాయర్లు, డ్యాంలు రూపుదిద్దుకున్నాయి. నేడు ఆయన 159వ జయంతి ఇంజనీర్ల దినంగా మారిపోయింది. సివిల్‌ ఇంజనీర్‌గా, మైసూరు సంస్థానం దివాన్‌గా తనదైన ముద్రను చాటుకున్నారు. రాష్ట్రంలో పేరొందిన కెఆర్‌ఎస్‌ డ్యామ్‌ నిర్మాణం ఆయన సారథ్యంలోనే జరిగింది. అలాగే హైదరాబాద్‌లో వరదలనుంచి తప్పించేలా భారీ కాలువల నిర్మాణానికి ప్లానింగ్‌ చేశారు. ఆయన విశిష్ట సేవలకుగాను అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం ‘సర్‌’ బిరుదును ప్రదానం చేసింది. 1955లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. 1861 సెప్టెంబరు 15న మోక్షగుండం బెంగళూరు సమీపంలోని ముద్దేనహళ్లిలో జన్మించారు. ఆయన పూర్వీకులు ఏపీలోని ప్రకాశం జిల్లా మోక్షగుండానికి చెందిన వారు కావడం గమనార్హం. విశ్వేశ్వరయ్యకు 12 ఏళ్ళ వయస్సులో తండ్రి శ్రీనివాస శాస్త్రి కన్నుమూశారు. ఆయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం చిక్కబళ్ళాపురలోని బండహళ్ళిలో సాగింది. హైస్కూల్‌కోసం బెంగళూరుకు వచ్చారు.

1881లో బెంగళూరు సెంట్రల్‌ కాలేజి నుంచి బిఎ పట్టా పొందారు. అప్పట్లో మద్రాస్‌ యూనివర్శిటీకి అనుబంధంగా ఉండేది. తదుపరి పూనెలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరారు. అప్పటి బాంబే ప్రజాపనులశాఖలో ఉద్యోగంలో చేరారు. ఇరిగేషన్‌లో నీటిపారుదల వ్యవస్థకు పలు కీలక ప్రాజెక్టులు నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు రిజర్వాయర్‌లలోని గేట్‌లు ఆటోమేటిక్‌గా పనిచేసేలా డిజైన్లను రూపొందించారు. అనంతరం మండ్యలోని క్రిష్ణరాజసాగర్‌ డ్యామ్‌ల నిర్మాణానికి ఆయనే సారథ్యం వహించారు. అలాగే విశాఖపట్నం ఓడరేవు సముద్రకోత నుంచి దెబ్బతినకుండా చర్యలు చేపట్టారు. నీటిపారుదలరంగాలలో తనదైన ముద్రను వేసు కున్న మోక్షగుండం భావిఇంజనీర్లకు స్ఫూర్తిప్రదాత అని చెప్పడంలో అతిశయోక్తిలేదు.

Related posts