telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇప్పటివరకు భారత్ లో స్ట్రెయిన్ కేసులు ఎన్నంటే..?

గత ఏడాది చైనా నుండి వచ్చిన కరోనా ఇప్పటికి మన దేశాన్ని వదిలి పోలేదు. కానీ ఈ మధ్యే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 16న నుండి కరోనాకు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో కేసుల సంఖ్య మరింత తగ్గుముఖం పట్టింది.  రోజుకు లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ అందిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, కరోనా కేసులు తగ్గుతున్న బ్రిటన్ నుంచి వచ్చిన కొత్త స్ట్రెయిన్ కేసులు భయపెడుతున్నాయి.  చాపకింద నీరులా మెల్లిగా వ్యాపిస్తున్నాయి.  ఇప్పటి వరకు దేశంలో మొత్తం 150 కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.  కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదైన వ్యక్తులను సింగిల్ గా ఐసోలేషన్ గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.  ఇక ఇప్పటి వరకు కొత్త స్ట్రెయిన్ 60 దేశాలకు వ్యాపించింది.  దీంతో పాటుగా దక్షిణాఫ్రికాలో జన్యుమార్పిడి చెందిన స్ట్రెయిన్ కేసులు 20కి పైగా దేశాల్లో వ్యాపించినట్టు గణాంకాలు చెప్తున్నాయి.  50 శాతం వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తున్నట్టు పరిశోధకులు చెప్తున్నారు. చూడాలి మరి ఈ కేసులు ఎప్పటికి తగ్గుతాయి అనేది.

Related posts