telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ప్రపంచంలోనే 20 అత్యంత కాలుష్య నగరాలలో.. 15 భారతదేశంలోనే..!!

15 out of 20 polluted cities are in india

భారత్, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా మారుతోంది. ఎయిర్ విజువల్ అండ్ గ్రీన్ పీస్ సంస్థ ఈరోజు విడుదల చేసిన డేటా ప్రకారం మన దేశంలో ప్రమాద స్థాయి ఏ విధంగా ఉందొ తెలియజేస్తుంది. ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో 15 మన దేశంలోనే ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టాప్ 10 కాలుష్య నగరాల్లో కూడా 7 భారత్ లోనే ఉన్నాయి. మిగిలిన మూడింట్లో ఒకటి చైనా (హోటన్), రెండు పాకిస్థాన్ (ఫైసలాబాద్, లాహోర్)లో ఉన్నాయి.

ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) లో ఉండే గురుగావ్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఇతర భారత నగరాల్లో ఘజియాబాద్, ఫరీదాబాద్, భివాండీ, నోయిడా, పాట్నా, లక్నోలు ఉన్నాయి. అత్యంత కలుషిత 11వ నగరంగా ఢిల్లీ నిలిచింది. పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) 2.5 ఆధారంగా ఈ కాలుష్యాన్ని కొలిచారు. గాలిలో ఘన, ద్రవ కణాలు కలిసిపోయి ఉండటాన్ని పీఎం 2.5 ద్వారా కొలుస్తారు. పీఎం 2.5 కాలుష్యానికి గురైన వారు శ్వాస సంబంధిత వ్యాధులతో (ఆస్తమా వంటివి) బాధపడతారు. దీనికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారైనా దీనికి బాధితులుగా మారాల్సిందే.

చైనా కాలుష్యాన్ని నియంత్రించడంలో ఎంతో పురోగతిని సాధించింది. 2013లో ఆ దేశ రాజధాని బీజింగ్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. దీంతో, చైనా ప్రభుత్వం కాలుష్యాన్ని నియంత్రించడానికి అప్పటి నుంచి యుద్ధ ప్రాతిపదికన కట్టుదిట్టమైన కార్యాచరణను అమలు చేసింది. దీంతో, దేశంలోని కాలుష్యం ఏకంగా 40 శాతం తగ్గింది. ఈ విషయంలో చైనా నుంచి మనం చేర్చుకోవాల్సింది చాలా ఉందనే విషయం అర్థమవుతోంది.

Related posts