telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

బదిర బాలిక అత్యాచార కేసులో … లిఫ్ట్‌ అపరేటర్‌ సహా 15 మంది దోషులే …

Court-Order

అయనావరంలో బదిర బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో లిఫ్ట్‌ అపరేటర్‌ సహా 15 మంది దోషులేనని స్థానిక మహిళా కోర్టు శనివారం ఉదయం తీర్పు వెలువరించింది. అయనావరం సయానీ ప్రాంతం వద్దనున్న ప్లాట్‌లో నివసించే ఓ బాలికపై లిఫ్ట్‌ ఆపరేటర్‌ రవికుమార్‌ (56) అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత అక్కడే పనిచేస్తున్న వాచ్‌మెన్‌లు అభిషేక్‌, సుకుమార్‌ విషయాన్ని తెలుసుకుని ఆ బాలిక పై అఘాయిత్యానికి ఒడిగట్టారు. తమకు లొంగకపోతే చంపుతామంటూ బెదరించి వీరు ఆరు నెలలపాటు ఆ బాలికపై వంతుల వారీగా అత్యాచారం జరిపారు. ఈ ముగ్గురే కాకుండా మరో పద్నాలుగు మంది ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని తన ఇంటి కొచ్చిన సోదరికి ఆ బాలిక తెలుపగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు రంగంలోకి 17 మందిని అరెస్టు చేశారు.

2018 జూన్‌లో ఈ సామూహిక అత్యా చారం ఘటన వెలుగు చూడడంతో రాష్ట్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించాయి. తనపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను పుళల్‌ జైలుకు వెళ్ళి ఆ బాలిక గుర్తించింది. దీంతో పోలీసులు అరెస్టు చేసిన లిఫ్ట్‌ ఆప రేటర్‌ రవికుమార్‌ (56), సురేష్‌ (32), రాజశేఖర్‌ (48), ఏరాల్‌ ప్రాస్‌ (58), అభిషేక్‌ (28), కుమరన్‌ (60), మురుగేశన్‌ (54), పరమశివం (60), జయగణేశ్‌ (23), పళని (40), దీనదయాళన్‌ (56), బాబు (36), రాజా (32), సూర్యా (28), గుణశేఖరన్‌ (55), జయరామన్‌ (26), ఉమాపతి (42)పై గూండాచట్టం ప్రయోగించారు.

ఆ గుండాచట్టాన్ని గతేడాది జనవరి 11న హైకోర్టు రద్దు చేసింది. కానీ వారికి బెయిలు మంజూరు చేయలేదు. నిందితులలో బాబు జైలులో ఉన్నప్పుడు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈ అత్యాచారం కేసును మహిళా కోర్టు విచారణ జరిపింది. ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ తోసివేతకు గురైంది. ఆ సందర్భంగా హైకోర్టు మూడు మాసాలలోప కేసు విచారణను పూర్తి చేయ మంటూ మహిళా కోర్టును ఆదేశించింది. ఆ తర్వాత కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున న్యాయవాది రమేశ్‌ వాదించారు. ఈ కేసు విచారణ డిసెంబర్‌లో ముగియగా, తీర్పు ఫిబ్రవరి 1న వెలువరించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు శనివారం ఉదయం మహిళా కోర్టు మేజిస్ట్రేట్‌ తీర్పు వెలువరిం చారు. 16 మంది నిందితులలో 15 మంది దోషులేనని సాక్ష్యాధారాలతో సహా రుజువైందని, తోటమాలి గుణ శేఖర్‌ను నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు ఆ తీర్పులో పేర్కొన్నారు. ఇక 15 మంది నిందితులకు శిక్ష విధించాల్సి ఉంది.

Related posts