telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం : 13 మంది సజీవ దహనం

మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల్గర్ జిల్లాలోని విరార్ నగరంలో విజయ్ వల్లభ కరోనా ఆస్పత్రిలోని ఐసీయూ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 13 రోగులు సజీవ దహనం అయ్యారు. అందరు నిద్రలో ఉండటం, మంటలు వేగంగా వ్యాపించడంతో…రోగులు బయటకు వెళ్లలేకపోయారు. ఇక మరికొంత మంది రోగులను వేరే ఆస్పత్రులకు తరలిస్తున్నారు సిబ్బంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా నాసిక్‌లోని డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఈ నెల 21 న ఆక్సీజన్ ట్యాంకర్ లీకైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలో ఉన్న దాదాపు 22 మంది రోగులకు పైగా మరణించారు. ఈ అంశం జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Related posts