telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

123 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు బంద్…

students college

ఇంటర్ బోర్డ్ అధికారులుమాట్లాడుతూ… ఈ ఒక్క ఏడాదే 123 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు క్లోజ్ అయినట్లు  తెలిపారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో కేవలం 86 వేల అడ్మిషన్స్ జరిగినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇస్తే అప్పుడు జూనియర్ కళాశాలలు ప్రారంభం అవుతాయాని… అయితే తాము మాత్రం జనవరి లోనే స్టార్ట్ చేయాలని ప్రభుత్వం కి ప్రతిపాదనలు పంపించాము అని అన్నారు. Cbse పరీక్షల కన్నా ముందే ఇంటర్ పరీక్షలు ఉండొచ్చు.. అయితే ఈ ఏడాది 70 శాతం సిలబస్ నుండే పరీక్షలు ఉంటాయి. అయితే పరీక్ష పేపర్ పాటర్న్ లో చేంజ్ ఉండదు..కానీ విద్యార్థులకు ఛాయిస్ ఎక్కువగా ఉండేలా ప్రశ్నల సంఖ్య పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రెండు మూడు రోజుల్లో పరీక్ష ఫీ చెల్లింపు తేదీల ప్రకటన ఉంటుంది. 138 మంది జూనియర్ లెక్చరర్ లకు ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ గా ప్రమోషన్స్ ఇస్తున్నాం. కాంట్రాక్ లెక్చరర్ ల బదిలీ పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.. కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవడానికి 1548 ప్రైవేట్ జూనియర్ కళాశాలలకి ఇంటర్ బోర్డ్ అనుమతి ఇచ్చింది.. ఇందులో 1540 కళాశాలల కి అఫిలియేషన్ కి దరఖాస్తు ఫీ కట్టాయి. 1466 కళాశాలలకు అనుబంధ గుర్తింపు పూర్తి అయ్యింది. ఇంకా 74 కళాశాలల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో 41 కళాశాలలు షిఫ్టింగ్ కి దరఖాస్తు చేసుకున్నాయి…  24 కళాశాలల షిఫ్టింగ్ ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. ఇక గతేడాదితో పోలిస్తే ఈ సారి 123 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అనుబంధ గుర్తింపు కొసం దరఖాస్తు చేసుకోలేదు అని అన్నారు.

Related posts