telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ ముంబై ఘటనకు నేటితో 12 ఏళ్ళు…

ముంబై ఉగ్రదాడి.. దేశ ఆర్థిక రాజధానిపై జరిగిన ఉగ్రదాడికి నేటికి 12 ఏళ్లు.. 2008లో నవంబర్‌ 11వ తేదీన జరిగిన దాడిలో పాల్గొన్న 11 మంది ఉగ్రవాదులు తమ గడ్డకు చెందిన వారే అని ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ పేర్కొన్న సంగతి తెలిసిందే.. కానీ, 26న ముంబైలో జరిగిన మారణహోమం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆర్థిక రాజధానిని తూటాల వర్షంతో చిన్నాభిన్నం చేసిన ఉగ్ర విధ్వంసం ఇంకా దేశ ప్రజ‌లు కార్చిన క‌న్నీటికి స‌జీవ సాక్షంగా నిలుస్తోంది. నేటికి సరిగ్గా 12 కిత్రం ముంబైపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 12 మంది లష్కరే ఉగ్రమూకల బారిన పడి 166 మంది ప్రాణాలు కోల్పోతే.. 300 మందికి పైగా గాయపడ్డారు. అసలు ఆ రోజు ఏం జరిగింది.. ఎలా జరిగిందో ఓసారి పరిశీలిస్తే.. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ రైల్వేస్టేషన్‌లో తొలి బుల్లెట్‌ను పేల్చాడు అజ్మల్‌ కసబ్‌.. ఆ తర్వాత కాసేపటికి.. నారీమన్‌ హౌస్‌లో మరో బృందం కాల్పులకు తెగబడింది. ఇక్కడి ఇజ్రాయెలీల నివాస సముదాయమైన ‘జూయిష్‌ చాబాద్‌’ను ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత.. విదేశీ పర్యాటకులు, స్థానికులతో కిటకిటలాడే విలాసవంతమైన ‘లెపార్డ్‌’ కేఫ్‌లోకి నలుగురు ఉగ్రవాదులు చొరబడి చెలరేగిపోయారు. 15 నిమిషాలపాటు అక్కడ తూటాలతో విధ్వంసం సృష్టించి.. సమీపంలోని ‘తాజ్‌ హోటల్‌’లోకి చొరబడ్డారు. చివరగా.. ఒబెరాయ్‌ ట్రైడెంట్‌లోకి ఇద్దరు ఉగ్రవాదులు ప్రవేశించి మారణ హోమం ప్రారంభించారు.

ఇలా అత్యంత పాశవికంగా.. దారుణానికి ఒడిగట్టాయి ఉగ్రమూకలు.. ఇక, ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ కసబ్‌కు లష్కరే తోయిబా కరాచీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తేలింది.. ఇక, కసబ్‌కు శిక్ష విధించేందుకు జాదవ్ ముఖ్యమైన సాక్ష్యంగా మారారు. జడ్జీలకు పోలీసు వాహనంలో జరిగిన సంఘటనలను జాదవ్ పూసగుచ్చినట్లు వివరించారు. 2010, మేలో కసబ్‌కు మరణశిక్ష విధించారు. ఆ తర్వాత మరో రెండేళ్లకు పుణెలోని యెరవాడ జైలులో దానిని అమలు చేసిన సంగతి విదితమే.. జాదవ్ చూపిన ధైర్యసాహసాలకు అతనికి శౌర్యసాహసాలకు ఇచ్చే పురస్కారం లభించింది. ఆయన పెద్ద కూతురికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఇక, 26/11 ముంబై ఉగ్ర దాడులకు పన్నెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడుల్లో అమరులైన భద్రతా సిబ్బందికి నివాళులర్పించే కార్యక్రమాన్ని నగర పోలీసులు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో ప్రజలను మాత్రమే అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమం దక్షిణ ముంబైలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో కొత్తగా నిర్మించిన స్మారక చిహ్నంలో జరుగుతుందని పేర్కొన్నారు.

Related posts