telugu navyamedia
ఆరోగ్యం తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ : .. రోటావైరస్‌వ్యాక్సిన్‌ .. ప్రజారోగ్య కేంద్రాలలో అందుబాటులోకి ..

funds to telangana by central govt

రాష్ట్రంలో 12రకాల వ్యాక్సిన్‌లను అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. సార్వత్రిక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 0-16 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు ఈ వ్యాక్సిన్‌లు వేసేందుకు తెలంగాణ ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. వ్యాక్సిన్‌ ద్వారా నియంత్రించే వ్యాధుల వల్ల మరణాల రేటును తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. వ్యాధితో బాధపడే వారి సంఖ్యను కూడా తగ్గించ వచ్చని ప్రభుత్వం భావిస్తోంది.గర్భిణీ స్ర్తీలకు టి.డి. (టెటానస్‌ డిప్తీరియా) వ్యాక్సిన్‌ఇవ్వడం ద్వారా పిల్లలకు ఢిప్తీరియా రాకుండా నివారించ వచ్చని అధికారులు తెలిపారు.

ఆయా కేంద్రాల్లో వేసే వ్యాక్సిన్‌లతో భాగంగా రోటావైరస్‌వ్యాక్సిన్‌ను కూడా ఇవ్వనున్నారు రోటావైరస్‌ వ్యాక్సిన్‌ నోటి ద్వారా వేసే వ్యాక్సిన్‌. ఇది పిల్లల్లో రోటా వైరస్‌ వల్లకలిగే డయేరియా రాకుండా కాపాడుతుంది. ఆరు వారాల నుంచి ఒక సంవత్సరం లోపు వయస్సు గల పిల్లలు ఈ వ్యాక్సిన్‌ వే యించుకోవడానికి అర్హులు. ఈ వ్యాక్సిన్‌ను సంవత్సరపు లోపు పిల్లలకే వే యనున్నారు.రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ను పోలియో, పెంటావాలెంట్‌ వాక్సిన్‌తో పాటుగా ఇవ్వనున్నారు. గురువారం ప్రారంభమైన రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో , ఉప కేంద్రాల్లోనూ ఈనెల 31 తేదీ వరకూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Related posts