telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

వైద్యం అందిస్తున్న డాక్టర్లను క్వారంటైన్‌కు తరలింపు

deaths increased to 131 due to corona virus

ఏపీలోని గుంటూరు జిల్లాలో జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న 12 మంది డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు. ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురి రిపోర్ట్‌ రాగా, అందులో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

మరో 50 మంది కరోనా పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు లాడ్జీలోని క్వారంటైన్‌ కేంద్రానికి డాక్టర్లు, వైద్య సిబ్బందిని తరలించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. జిల్లాలో ఇప్పటివరకు ఒక మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీలకు కరోనా సోకినట్టుగా అధికారులు చెప్పారు. ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించుకున్న దాదాపు 190 మంది క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు.

Related posts