telugu navyamedia
telugu cinema news

“118” సినిమాపై మహేష్ స్పందన

Mahesh-Babu-and-118

కళ్యాణ్ రామ్ నటుడిగా, నిర్మాతగా రెండు రంగాల్లో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘118’ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మార్చి 1న విడుదలైన ఈ చిత్రం డిసెంట్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు సినిమాపై మంచి టాక్ రావటంతో వసూళ్లు బాగానే ఉన్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమా కథ, స్క్రీన్ ప్లేతో పాటు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉండటంతో మంచి టాక్ వచ్చింది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బయ్యర్ల పెట్టుబడిలో 40 శాతం రాబట్టినట్టు చెబుతున్నారు. తొలివారంలోనే ఈ సినిమా లాభాల బాట పట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

ఇక “118” చూసిన సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆసక్తిని కలిగించే కథాకథనంతో సాగే ఈ సినిమాను చూస్తూ తాను చాలా ఎంజాయ్ చేశానని, సినిమాటోగ్రఫర్ గా, దర్శకుడిగా గుహన్ అద్భుతమైన పనితీరును కనబరిచారని ప్రశంసించారు. ఈ సినిమా ఈ స్థాయిలో తెరపైకి తీసుకురావడానికి కారణమైన టీమ్ కు ఆయన అభినందనలు తెలియజేశాడు. మహేశ్ బాబు స్పందనకి ఈ సినిమా టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్… గర్భవతి అయిన స్టార్ హీరోయిన్

ashok

ఒకరు భయపెడితే సినిమావాళ్లు భయపడరు: మురళీమోహన్

vimala p

వాట్సాప్ చాట్ లీక్ చేసిన సాయి ధరమ్ తేజ్… తాడిమట్టయ్య అవుట్…

vimala p