telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరో రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన రాజ్ తరుణ్ తనదైన నటనతో అందరినీ ఆకర్షించారు. ఆ తర్వాత వరుస పరాజయాలను చవిచూశారు. అదే సమయంలో విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రానున్నట్లు ప్రకటించారు. వీరి కాంబోలో రూపొందుతున్న రెండో సినిమా పవర్ ప్లే. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. నేడు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రాజ్ తరుణ్ లిప్ లాక్ పెడుతూ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ పై హ్యాపీ వాలెంటైన్ డే అంటూ అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts