telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

దుబాయ్ నుండి బంగారం స్మగ్లింగ్.. 110 కిలోలు స్వాధీనం..

two kilo gold in cheppal found

డైరెక్టరేట్ రెవెన్యూ ఆఫ్ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు, దుబాయ్ నుంచి ముంబయికి బంగారాన్ని తరలిస్తున్న రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఏడుగురితో కూడిన సిండికేట్ ముఠాగా ఏర్పడి దుబాయ్ నుంచి ఇత్తడి పేరిట బంగారాన్ని ముంబయికు తరలించి ఇక్కడి జవేరి బజారులో విక్రయించి డబ్బును హవాలా మార్గంలో దుబాయ్ దేశానికి పంపిస్తున్నారు.

ఈ రాకెట్ కు పలు కంపెనీల అధినేత నిసార్ అలియార్ (43) కీలకపాత్ర వహించాడు. అమెరికా, దుబాయ్, కేరళలోని కొచ్చి ప్రాంతాల్లో్ నిసార్ కు పలు కంపెనీలున్నాయి. ఈయనతో పాటు షోయల్ మెహమూద్ జోర్దార్ వాలా(47), అతని కుమారుడు అబ్దుల్ జోర్దార్ వాలా(26), బంగారం వ్యాపారి మనోజ్ గిరిధారిలాల్ జైన్, హ్యాపీ అర్వింద్ కుమార్, హవాలా ఆపరేటర్ అఖిల్ ఫ్రూట్ వాలా, షేక్ అబ్దుల్ అహద్ లను పోలీసులు అరెస్టు చేశారు.

బంగారం రాకెట్ లో నిందితుడైన సోహెబ్ జోర్దార్ వాలా అజ్మీర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని అని, ఇతను గతంలో ఐఎస్ లో చేరిన అరీబ్ మజీద్ కు టూర్ వీసా ఇప్పించాడని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ బృందం దర్యాప్తులో వెలుగు చూసింది. ముంబయిలోని జోర్దార్ వాలా, హ్యాపీ దక్కడ్ ల నివాసాల నుంచి 1.81 కోట్ల విలువైన 110 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిస్క్ లు, వైర్లు, రాడ్లు, తాళ్ల రూపంలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత సంవత్సరం ఈ ముఠా 200 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేశారని వెల్లడైంది.

Related posts