telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తల్లిని కొడుతున్న మామయ్య… ఆ 11 ఏళ్ల బాలుడు ఏం చేశాడంటే ?

Arrest

ఫ్లోరిడాకు చెందిన పనాగియోటిస్ కరామన్లిస్(44) అనే వ్యక్తి సోదరితో ఆమె తన ప్రియుడికి పంపించిన టెక్ట్స్ మెసేజ్‌ల విషయమై వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆమెపై పనాగియోటిస్ చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో ఆమె ఇద్దరు పిల్లలు అక్కడే ఉన్నారు. దాంతో తన పిల్లల ముందు తనను కొట్టొదని ఆమె సోదరుడిని వేడుకుంది. కాని పనాగియోటిస్ అది వినిపించుకోకుండా ఆమె ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. తల్లిపై మామ చేయిచేసుకోవడం చూసిన ఆమె పెద్ద కొడుకు వెంటనే పక్కన ఉన్న కత్తెరతో పనాగియోటిస్ వెన్నులో రెండుసార్లు పొడిచాడు. దాంతో అతడు విలవిలాడుతూ కిందపడిపోయాడు. వెంటనే తల్లి వద్దకు వెళ్లిన బాలుడు “అమ్మ.. నేను వాడ్ని వెన్నులో పొడిచేశాను.. ఇక లేవడు.. నిన్ను కొట్టడంటూ” ఆమెను ఓదార్చాడు. ఈ ఘటనపై బాధితురాలు పిన్నెల్లాస్ కౌంటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వెంటనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు గాయాలతో ఉన్న పనాగియోటిస్‌ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం జరిగిన విషయం గురించి బాధితురాలిని అడిగి తెలుసుకున్న పోలీసులు పనాగియోటిస్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తాను ఆమెను కొట్టలేదని, కేవలం జట్టు పట్టుకొని నేలపై పడేసినట్లు చెప్పాడు. అది చూసిన ఆమె కుమారుడు తనను కత్తెరతో వెన్నులో పొడిచినట్టు తెలిపాడు. ఆ సమయంలో పిల్లలు ఉన్నారని నీకు తెలియదా? అని పోలీసులు పనాగియోటిస్‌ను అడిగారు. తెలుసు గాని ఇలా జరుగుతుందని అనుకోలేదని వాపోయాడు. దీంతో అతడిపై పిల్లల ముందు అసభ్యంగా ప్రవర్తించడం కింద కేసు నమోదు చేసి జైలులో పెట్టారు.

Related posts