telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

11 మంది ప్రాణాలు తీసిన ఆక్సిజన్…

oxygen sylender

ఆస్పత్రిలో ఆక్సీజన్ ట్యాంకర్ లీక్ కావడంతో రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలో ఉన్న 11 మంది రోగులు మరణించారు. ఈ అంశం జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశంగా అమరింది. మహారాష్ట్ర కరోనా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆక్సిజన్ ట్యాంకర్లను పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాసిక్‌లోని జాకీర్ ఆస్పత్రికి కూడా ట్యాంకర్ల ద్వారా ఆక్సీజన్ తరలించారు. వాటిని ఆస్పత్రిలోని ట్యాంకర్‌లో నింపుతుండగా ఒక్కసారిగా ఆక్సీజన్ లీకయిందని అంటున్నారు. పెద్ద మొత్తంలో లీకయిన నేపథ్యంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలోని 171 మంది రోగులు ఆక్సీజన్‌పై చికిత్స పొందుతున్నారు. ఐతే ట్యాంక్ లీక్ కావడంతో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రాణ వాయువు అందక 11 మంది మరణించారు.

Related posts