telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కరోనాను జయించిన 106 ఏళ్ళ వృద్ధుడు

Corona

కరోనాతో విలయతాండవంతో వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది మరణిస్తున్నారు. కానీ తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సోకిన 106 ఏళ్ల వృద్ధుడొకరు.. ఆస్పత్రిలో చికిత్సతో కోలుకుని డిశ్చార్జయ్యాడన్న విషయం ఇప్పుడు హల్చల్ చేస్తోంది. 1918-19 మధ్య ప్రపంచాన్ని వణికించిన స్పానిష్‌ ఫ్లూ సమయానికి ఆయన నాలుగేళ్ల బాలుడు. అయితే, ఈయనకు ఆ మహమ్మారి సోకిందా? లేదా? అన్నదానిపై ఆధారం లేదు. అయినప్పటికీ, వేలాది మందిని బలిగొన్న స్పానిష్‌ ఫ్లూ.. ప్రభావం నుంచి తప్పించుకున్నవాడిగా ఆయన గురించి వైద్యులు చెబుతున్నారు. తాజాగా వృద్ధుడు సహా ఆయన కుటుంబం వైరస్‌ బారినపడింది. 70 ఏళ్ల వయసున్న ఆయన కుమారుడు ఇంకా చికిత్స పొందుతుండగా, వృద్ధుడు మాత్రం డిశ్చార్జయ్యారు. వృద్ధుడి భార్య, మరో నలుగురు కుటుంబ సభ్యులు కూడా కోలుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక అప్పట్లో స్పానిష్ ఫ్లూ విజృంభించడంతో ప్రపంచ జనాభాలో మూడో వంతు మంది దీని బారినపడ్డారు. 1918 ఇన్‌ఫ్లూయేంజా ఇటీవలి చరిత్రలో అత్యంత తీవ్రమైన మహమ్మారి. ఏవియన్ మూలం జన్యువులతో కూడిన హెచ్1ఎన్1 వైరస్ వల్ల ఇది సంభవించింది. వైరస్ ఎక్కడ ఉద్భవించిందనే దానిపై సార్వత్రిక ఏకాభిప్రాయం లేనప్పటికీ, ఇది 1918-1919 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 1919-19లో ప్రబలిన వైరస్‌ స్పానిష్ ఫ్లూ చాలా తీవ్రమైంది.. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఐదో వంతు మరణాలు భారత్‌లోనే చోటుచేసుకున్నాయి.

Related posts