telugu navyamedia
andhra political trending

ఈ గ్రామంలో వందశాతం ఓటింగ్..అందరికి ఆదర్శం.. !

ec on voter id card and voting

ఓటును వంద శాతం వినియోగించుకోవడం ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటిది. అటువంటి కార్యక్రమంలో ఆదర్శంగా నిలుస్తారు ఆ గ్రామ ప్రజలు. ఎన్నిక వేళ ఓటు వేయకుండా తప్పించుకునేందుకు ఎటువంటి సాకులు వెదకరు. కారణాలు చూపించరు. సమయానికి వచ్చి ఓటేయడం వారికో పవిత్ర కార్యక్రమం. ఎన్నికల రోజును సెలవుగా భావించే పట్టణ వాసుల బాధ్యతను గుర్తు చేస్తున్న ఈ గ్రామస్థుల తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జె.అగ్రహారం ఓ పల్లెటూరు. ఊరిలో ఉన్నది కేవలం 392 మంది ఓటర్లు. వృత్తి ఉద్యోగాలపై ఎక్కడ ఉన్నా పోలింగ్‌ రోజు కచ్చితంగా ఊరికి వస్తారు. ఓటు వేసి వెళ్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఓటింగ్‌ జరిగిన గ్రామం ఇది.

ఊరిని పట్టిపీడిస్తున్న సారా మహమ్మారికి వ్యతిరేకంగా రెండు దశాబ్దాల క్రితం జనవిజ్ఞాన వేదిక అండగా గ్రామ మహిళలంతా ఉద్యమాన్ని చేపట్టారు. సారా రక్కసిని ఊరి నుంచి తరిమి కొట్టారు. గ్రామంలోని మహిళలంతా అక్షరాస్యులయ్యారు. పొదుపు సంఘాల్లో చేరి చైతన్యవంతులయ్యారు. ఓటు ప్రాముఖ్యతపై తమలో తామే చర్చించుకుని అందరూ ఓటు వేసేలా స్వీయ చైతన్యాన్ని ప్రోది చేసుకున్నారు. ఎక్కడ ఉన్నా, ఎన్నిపనులున్నా ఊరికి వచ్చి ఓటేయాలని తీర్మానించుకున్నారు. ఎన్నికల వేళ అందరం కూర్చుని చర్చిస్తాం. మంచి అభ్యర్థికి ఓటు వేయాలని నిర్ణయిస్తాం. అందరి అభిప్రాయాలు తెలుసుకుంటాం. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేస్తాం..అని తెలిపారు గ్రామానికి చెందిన మహాదేవి.

Related posts

మ‌సూద్ పై పాకిస్థాన్‌ చర్యలు..ఆస్తుల జ‌ప్తుకు ఆదేశం

ashok

ఇష్టంగా పచ్చిమిర్చి తినాలి.. అది కూడా ఎంతో .. ఆరోగ్యం.. తెలుసా..!

vimala p

అక్కడ ఒక్క రూపాయికే వైద్య పరీక్షలు..

vimala p