telugu navyamedia
సినిమా వార్తలు

ఫ్రిన్స్‌ దూకుడుకు ప‌దేళ్ళు ..

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. అమ్మాయిల క‌ల‌ల‌ రాకుమారుడు.. నాలుగు ప‌దులు దాటిన స్మార్ట్ లుక్‌తో దూసుకుపోతున్నాడు.. ఫ్రిన్స్‌ క్రేజ్ కు తగ్గట్టుగానే ఆయన కెరీర్ లో కొన్ని అద్భుతమైన చిత్రాలు కూడా ఖాతాలో ఉన్నాయి.

Dookudu (2011)

మ‌హేష్ న‌టించిన సినిమాల్లో భారీ స‌క్సెస్ సాధించిన వాటిలో దూకుడు మూవీ ఒక‌టి. ఈ సినిమాను శ్రీను వైట్ల దర్శకత్వం వ‌హించాడు. స‌రిగ్గా ఇదే రోజు 23 సెప్టెంబర్ 2011 న దూకుడు 1800 స్క్రీన్‌లపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 35 కోట్ల బడ్జెట్ తో మ‌హేష్ ఈ సినిమా తీశారు. ఈ చిత్రం 57.4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్స్ రాగా.. 101 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మహేష్ కెరీర్ లోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

samantha. mahesh babu auction: Mahesh Babu's Dookudu clothes to be auctioned by Samantha | Telugu Movie News - Times of India

ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా “దూకుడు” నిలిచింది. విమర్శకుల ప్రశంసలతో పాటు ఏడు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమాకు ప‌దేళ్ళు నిండ‌డంతో ఆంధ్రా తెలంగాణ‌లో కొన్ని థియెట‌ర్ల‌లో దినిని రిలీజ్ చేశారు. ఈ మూవీలో మహేష్ బాబు, సమంత హీరో హీరోయిన్లుగా.. ప్రకాష్ రాజ్, సోనూ సూద్ తో పాటు బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు.

List of Best Tollywood Police Films That You Must Watch

Related posts