telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పదేళ్ల బాలుడికి విమానంలోకి నో ఎంట్రీ… అలాంటి టీ షర్ట్ వేసుకోవడమే కారణమట…!

Snake

స్టీవీ లూకాస్ (10) అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి న్యూజిలాండ్ నుంచి సౌత్ ఆఫ్రికాకు ప్రయాణం చేస్తున్నాడు. అయితే తాను వేసుకున్న టీషర్ట్‌పై ఉన్న పాము బొమ్మ ప్రయాణికులను ఒత్తిడికి గురి చేసే విధంగా ఉందని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తెలిపింది. ఆ టీషర్ట్ తీసేసి వేరేది వేసుకుంటేనే తాము విమానం ఎక్కడానికి అనుమతి ఇస్తామంటూ సిబ్బంది తేల్చిచెప్పింది. దీంతో లూకాస్ ఆ టీషర్ట్ తీసేసి వేరేది వేసుకోవడంతో.. సిబ్బంది అతడిని విమానం ఎక్కడానికి అనుమతిచ్చింది. కాగా, ప్రయాణీకులు వేసుకున్న దుస్తులు, వారి దగ్గరున్న వస్తువులు ఇతరులకు ఒత్తిడి కలిగించే, హాని కలిగించే విధంగా ఉంటే వారిని నిరాకరించే హక్కు ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి ఉంటుంది.

Related posts