telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక సామాజిక

అక్కడ అమ్మాయిలు ఫోన్ లు వాడితే.. తండ్రికి తడిసిమోపెడు.. లక్ష జరిమానా..

1 lak penalty on use of mobile in

మొబైల్ వాడకులు భారతదేశంలోనే ఎక్కువ అని తాజా గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దానికి ఇక్కడ ఉన్న మార్కెట్ ఒక కారణం అయితే, మరొకటి ఇక్కడ డేటా టారిఫ్ లు అతితక్కువ ధరలకు అందుబాటులో ఉండటమే. దీనితో చిన్న వయసు నుండే మొబైల్ వాడకం అందుబాటులోకి వచ్చేసింది దేశంలో. దీనితో కొన్ని ప్రమాదాలు కూడా లేకపోలేదు. ఇక వీటిని ఎక్కువగా వాడుతూ, బానిసలైన వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ టెక్ వలన కొన్ని చోట్ల ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు పాటిస్తున్నారు. అందులో తాజాగా వెలుగులోకి వచ్చింది.. ఒకటి చూస్తే .. ఒక గ్రామంలో పెళ్లికాని అమ్మాయి ఎవరైనా మొబైల్ ఫోన్ వాడితే, అతని తండ్రి నుంచి లక్షన్నర రూపాయలు జరిమానాగా వసూలు చేస్తున్నారు. గుజరాత్ లోని ఓ గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఇది.

ఈ ఘటన రాష్ట్రంలోని బాణస్కాంత గ్రామంలో చోటుచేసుకుంది. ఇక్కడి పెద్దలు సమావేశమై, ఠాకూర్ వర్గంలోని పెళ్లి కాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అమ్మాయి ఫోనే వాడితే, ఆమె తండ్రి నుంచి రూ. లక్షన్నర జరిమానాగా వసూలు చేయాలని పెద్దలు నిర్ణయించారు. గ్రామ పెద్దలు కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వివాహ సమయాల్లో డీజేలు వద్దని, బాణసంచా కాల్చడాన్ని ఆపివేయాలని పెద్దలు నిర్ణయించారు. ఏ అమ్మాయి అయినా వారి పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే అది నేరమేనని అన్నారు. దీనిపై యువనేత అల్పేష్ ఠాకూర్ స్పందిస్తూ, పెళ్లి ఖర్చుల విషయంలో పెద్దల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, ఇదే సమయంలో మొబైల్ ఫోన్ల విషయంలో మాత్రం నిషేధం మంచిది కాదని అన్నారు.

Related posts