telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరో రామ్ కు గాయాలు… వీడియో వైరల్

Ram

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో తాజాగా నటిస్తున్న చిత్రం “రెడ్”. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవి కిషోర్‌ నిర్మించనున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే రామ్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రామ్‌ – తిరుమల కిషోర్‌ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో రామ్‌పై యాక్షన్‌ సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట. షూటింగ్‌లో రామ్‌కు స్వల్పంగా గాయాలైనట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. “హాయ్‌ మాస్టర్‌..మీరు కంపోజ్‌ చేసిన ఫైట్‌ చాలా అద్భుతంగా ఉంది. నా మీద చూపించే ప్రేమను ఫీలవుతున్నా..కానీ చూపించలేకపోతున్నా. దీంతోపాటు మీరు నాకిచ్చిన నొప్పిని కూడా చూపించలేకపోతున్నా..” అని ట్వీట్‌ చేస్తూ #రెడ్‌ఫిల్మ్‌ ,#రెడ్‌ ఫైట్‌ అని హ్యాష్‌ ట్యాగ్‌ జతచేశాడు. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నివేదాపేతురాజ్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది.

Related posts