telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాట్ వెబ్ సిరీస్ లో హన్సిక

Hansika

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మీడియా హవా నడుస్తోంది. సినిమాలతో సమానంగా వెబ్‌సిరీస్‌లకు కూడా ఆదరణ దక్కుతోంది. తక్కువ బడ్జెట్, సెన్సార్ లేకపోవడం వంటి సౌలభ్యాల కారణంగా చాలా మంది వెబ్ సిరీస్‌లపై దృష్టి సారిస్తున్నారు. దీంతో సినిమా స్టార్లు కూడా వెబ్ సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉత్తరాదిన ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలైంది. తాజాగా దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులు కూడా వెబ్‌సిరీస్‌ల పట్ల ఆసక్తి చూపుతున్నారు. సమంత, జగపతి బాబు, అమలాపాల్, ఈషారెబ్బ ఇప్పటికే వెబ్‌సిరీస్‌లపై దృష్టి సారించారు. ఇదే బాటలో హీరోయిన్ హన్సిక కూడా నడుస్తోంది. హన్సిక ఓ హాట్ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. `పిల్ల జమిందార్`, `భాగమతి` సినిమాల దర్శకుడు అశోక్ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందట. ఈ వెబ్ సిరీస్‌లో ముద్దు సీన్లు, గ్లామరస్ సీన్లలో హన్సిక నటించిందట. త్వరలోనే ఈ వెబ్‌సిరీస్ అందుబాటులోకి రానుంది.

Related posts