telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాయిపల్లవి “అనుకోని అతిథి” వాయిదా

AA

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అనుకోని అతిథి’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అధిరన్’కు తెలుగు అనువాదం. నవంబర్ 15న ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ను విడుదల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం చెప్పిన తేదీకి విడుదల కావడం లేదని చిత్రయూనిట్ తెలిపింది. త్వరలోనే విడుదలకు సంబంధించి కొత్త తేదీని ప్రకటిస్తామని తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాతలు తెలిపారు. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ “కేరళలో 1970లలో వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రాన్ని కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ఉత్కంఠకు గురి చేసే కథ, కథనాలతో సినిమా రూపొందింది. నవంబర్ 15న చిత్రాన్ని విడుదల చేయాలని చూశాం. కానీ ఆ తేదీన విడుదల చేయలేకపోతున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్ మరియు అతుల్‌ కులకర్ణి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందించిన జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు” అని అన్నారు.

Related posts