telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వెంకీ మామ” ట్రైలర్… రాతను తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకు ఉంది…!

Venky-mama

ఖమ్మంలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌లో “వెంకీ మామ” సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘మనిషి తల రాతను రాసే శక్తి దేవుడికుందని నీ నమ్మకం.. ఆ రాతను తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం’’ అని హీరో వెంకటేశ్ అంటున్నారు.ఈ ట్రైలర్‌లో వెంకటేశ్ యాక్షన్, కామెడీ టైమింగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అటు మేనల్లుడితో బంధాలు, బంధుత్వం కూడా అలరిస్తోంది. అల్లుడి కోసం మామ బోర్డర్‌లో.. మామ కోసం అల్లుడు గ్రామంలో చేసే పోరాటాలు థ్రిల్లింగ్‌గా అనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా మామ అల్లుళ్ల ప్రేమ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్నాయి. ఈ ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు యాక్షన్, కామెడీ, లవ్, రాజకీయాలతో పాటు సరిహద్దులను కూడా టచ్ చేసినట్లు కనిపిస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్.. వెంకటేశ్ సినిమా అంటే ఇలానే ఉంటుందనిపిస్తోంది. ఇక ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. కాగా ఈ చిత్రంలో వెంకటేశ్ రైతుగా, నాగచైతన్య ఆర్మీ ఉద్యోగిగా కనిపించనున్నారు. వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో రావురమేశ్, నాజర్, ప్రకాశ్‌రాజ్ అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్‌లో నిర్మాత సురేశ్ బాబు నిర్మించగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకున్నఈ ‘వెంకీమామ’ చిత్రం డిసెంబర్ 13న విడుదలకానుంది. సెన్నార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

Related posts