telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ సామాజిక

రెండో పెళ్ళికీ …కల్యాణలక్ష్మి పథకం వర్తింపు…

kalyana lakshmi scheme for 2nd marriage also

భారత సాంప్రదాయంలో పెళ్లి అనేది ఎంత పెద్ద తంతో అందరికి తెలిసిందే. అయితే కనీస సౌకర్యాలు లేని నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళ ఇబ్బందికర పరిస్థితుల్లో రెండో వివాహానికి సిద్ధమైతే కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద గతంలో లబ్ధిపొందనివారికే రెండో వివాహానికి ఆర్థికసహాయం వర్తిస్తుందని పేర్కొంటూ బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ.1,00,116 ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా పోతపల్లికి చెందిన పీ చిరంజీవి ప్రభుత్వానికి చేసిన వినతి మేరకు మహిళ రెండో వివాహానికి ఆర్థిక సహాయం అందించే విషయంపై విధివిధానాలను రూపొందించినట్టు చెప్పారు.

Related posts