telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోంది : ఆలపాటి రాజా

Alapati Rajendera prasad tdp

ఏపీలో ప్రస్తుతం ఎలక్షన్స్ రచ్చ నడుస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు ఎస్ఈసీని కోరాయి అని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. నామినేషన్లు వేసుకునేందుకు రెండు రోజులు అవకాశం ఇవ్వాలని ఎస్ఈసీని కోరాం. కొన్నిచోట్ల అభ్యర్థులు చనిపోయారు, మరికొన్ని చోట్ల అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరు. ఈ పరిస్థితుల దృష్ట్యా రీ-నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరముందని కోరాం. నిష్పక్షపాతంగా ,ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరాం. అధికార వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని కోరాం.గతంలో ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగిన చోట అంతా మళ్లీ ఎన్నికలు జరిపేందుకు రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని కోరాం. ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలకు రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని కోరాం అని అన్నారు. చూడాలి మరి దీని పై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారు అలాగే వైసీపీ అధికారులు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts