telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ సినిమాలో సమంత… కానీ హీరోయిన్ గా కాదు…!

Samantha

రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరిగి సినిమాల‌లోకి రావాల‌ని ఆస‌క్తి చూపుతున్న‌ట్టు ఇటీవ‌ల ప‌లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. పింక్ రీమేక్‌గా ప‌వ‌న్ కంబ్యాక్ చిత్రం ఉంటుంద‌ని, దీనికి లాయ‌ర్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. పింక్ చిత్రం త‌మిళంలో నెర్కొండ పార్వాయి అనే టైటిల్‌తో రూపొందిన విష‌యం తెలిసిందే. అజిత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నిర్మిత‌మైన ఈ చిత్రం మంచి హిట్ సాధించింది. ఈ సినిమాలో కీలక పాత్రల్లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. హిందీలో తాప్సీ, తమిళ్‌లో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన పాత్రను తెలుగులో సమంత చేయనుందట. పెళ్లి తరువాత ఎక్కువగా పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ రోల్స్‌ చేస్తున్న సామ్‌… ఈ పాత్రకు ఓకె చెప్పటం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత 96 తెలుగు రీమేక్ లో నటిస్తోంది. “ది ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్ కు కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తరువాత సమంత లాంగ్ గ్యాప్ తీసుకోనుంది అనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో “పింక్” రీమేక్ లో సమంత నటిస్తుందనే వార్తల్లో ఎంతమేరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Related posts