telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

నాకు సిబ్బంది కావాలి..తగ్గించకండి.. : మన్మోహన్ సింగ్

manmohan on his security to modi

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు కేటాయించిన సహాయ సిబ్బందిని తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి రెండోసారి లేఖ రాశారు. గతంలో తనకు 14 మంది సహాయ సిబ్బంది ఉండేవారని, ఆ సంఖ్యను ఐదుకు తగ్గించడం తగదని ఆ లేఖలో పేర్కొన్నారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు మాజీ ప్రధాని వాజపేయికి తొలి ఐదేండ్లు పూర్తి సహాయ సిబ్బందిని (14 మందిని) కేటాయించానని, తర్వాత ఆయన సూచన మేరకు ఆ సంఖ్యను 12కు తగ్గించానని గుర్తుచేశారు.

పూర్తిస్థాయి సహాయ సిబ్బందిని కొనసాగించాలంటూ గతంలో కూడా లేఖ రాశానని, కానీ తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండా సిబ్బందిని తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధానులకు 14 మంది సహాయ సిబ్బందిని కేటాయించాలని దివంగత ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి రావడానికి నాలుగు రోజుల ముందు తన సహాయ సిబ్బందిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదని, ఇప్పటికైనా పూర్తిస్థాయి సహాయ సిబ్బందిని కేటాయించాలని మన్మోహన్ విజ్ఞప్తి చేశారు.

Related posts