telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

దొంగలు గెలుచుకున్న 36 కోట్ల లాటరీ… కానీ…!?

Lottery

లండన్‌లో తోడు దొంగలిద్దరు క్లామెట్ అనే లాటరీ కంపెనీలో ఏప్రిల్ 22న ఓ స్క్రాచ్ కార్డ్ కొన్నారు. 10 పౌండ్లు పెట్టి కొన్న ఆ స్క్రాచ్ కార్డ్‌కు 4 మిలియన్ పౌండ్ల (రూ. 36 కోట్ల 32 లక్షలు) లాటరీ తగిలింది. దీంతో వాట్సన్, మార్క్ అనే దొంగలిద్దరూ ఎగిరి గెంతేశారు. తాము గెలుచుకున్న సొమ్మును అడగడానికి లాటరీ కంపెనీకి వెళ్లగా.. వారు డెబిట్ కార్డ్ వివరాలు అడిగారు. తమకు అసలు డెబిట్ కార్డ్ అనేదే లేదు అని దొంగలిద్దరూ సమాధానం ఇవ్వడంతో లాటరీ సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆ లాటరీని కార్డు ద్వారానే కొన్నట్టు వివరాలు ఉన్నాయని.. డెబిట్ కార్డు లేకుండా స్క్రాచ్ కార్డు ఎలా కొన్నారని సిబ్బంది ప్రశ్నించారు. దీంతో ఖంగుతిన్న దొంగలు ఆ కార్డు జాన్ అనే తమ స్నేహితుడిదని.. ప్రస్తుతం వేరే రాష్ట్రంలో ఉన్నట్టు బదులిచ్చారు. లాటరీ సిబ్బందికి స్క్రాచ్ కార్డును వారి డబ్బులతో కొనలేదనే సంగతి అర్థమైంది. దొంగిలించిన కార్డు ద్వారా కొన్నట్టు అనుమానిస్తున్నారు. సొమ్ము దొంగలకు చెందుతుందా లేదా అనే విషయాన్ని కంపెనీ హోల్డ్‌లో పెట్టింది. మార్క్ అనే దొంగపై 22 నేరారోపణలు, 45 కేసులు ఉన్నాయి. లాటరీ టికెట్ తగిలే కొన్ని రోజుల క్రితమే మార్క్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ లాటరీ సొమ్ము దొంగలకు చెందుతుందా లేదా ఏ కార్డుతో కొనుగోలు చేశారో ఆ కార్డు ఓనర్‌కు చెందుతుందా అన్నది తెలియాల్సి ఉంది. మార్క్, వాట్సన్ మాత్రం తాము కోటేశ్వరులం అయిపోయామని.. సొమ్ము వచ్చిన వెంటనే ఏం చేయాలో కూడా ప్రణాళికలు సిద్దం చేసేసుకున్నామని ఆనందపడుతున్నారు.

Related posts