telugu navyamedia
సామాజిక

తిరుమల దర్శనానికి వెళుతున్నారా..? జాగ్రత్త..!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న భక్తులకు అలర్ట్. దర్శనం టికెట్ల పేరుతో కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా రూ.300 టికెట్లను భక్తులకు ఇవ్వగా.. దర్శనానికి వెళ్లిన భక్తులను అధికారులు అడ్డుకున్నారు. వారు చెప్పిన సమాచారంతో విజిలెన్స్ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా.. తిరుపతిలో తమకు టికెట్లు విక్రయించినట్లు చెప్పారు. విజిలెన్స్ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన తిరుమ‌ల టూటౌన్ పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ..

దర్శనం టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసే వాహనాలను, డ్రైవింగ్ లైసెన్సులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. భక్తులు దర్శనం టికెట్ల పేరుతో మోసపోవద్దని..అనుమానం వస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Related posts