telugu navyamedia
సినిమా వార్తలు

టాలీవుడ్ కు మరో కొత్త హీరోయిన్

Perlene

వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై నిహారిక కొణిదెల‌, రాహుల్ విజ‌య్ జంట‌గా న‌టించిన చిత్రం “సూర్య‌కాంతం”. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజ‌న్ ఎర‌బోలు, రామ్ న‌రేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్లో మరో అందమైన హీరోయిన్ కన్పించింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఎవరనే ఆసక్తి కలిగింది అందరిలో. ఈ సినిమాలో రాహుల్ విజయ్ సరసన మరో కథానాయికగా నటించిన బ్యూటీ పేరు “పెర్లిన్ భెసానియా”. ఈ ముంబై ముద్దుగుమ్మ చాలా యాడ్స్ చేసింది కానీ తెలుగులో మాత్రం ఇదే తొలి సినిమా. తాజాగా ఈ హీరోయిన్ స్పందిస్తూ “నిజానికి నాకు తెలుగు రాదు. హిందీలో డైలాగ్స్ రాసుకుని చెప్పాను. ఈ సినిమాలో నేను చేసిన ‘పూజ’ పాత్ర నాకు మంచి క్రేజ్ తీసుకొస్తుందని అనుకుంటున్నాను. నిహారికతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా విడుదలకాకముందే వరుస అవకాశాలు రావడం సంతోషాన్ని కలిగిస్తోంది” అని చెప్పుకొచ్చింది. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్‌ లో జ‌రిగింది. ఈ వేడుకకు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా రావడంతో సినిమాకు హైప్ వచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “సూర్యకాంతం” చిత్రం మార్చి 29న విడుదల కానుంది.

Related posts