telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరుతో జతకట్టనున్న త్రిష ?

trisha

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా మంచి విజయాన్ని సాధిస్తుండటంతో ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న చిరు త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరు 152వ చిత్రం తెర‌కెక్క‌నుండగా, ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ మొద‌టి వారంలో సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నార‌ట‌. రామోజీ ఫిలిం సిటీలో చిత్రం కోసం ప్ర‌త్యేక సెట్ కూడా రూపొందించిన‌ట్టు సమాచారం. తొలి షెడ్యూల్ మొత్తాన్ని ఈ సెట్‌లోనే చిత్రీక‌రించనున్న‌ట్టు తెలుస్తుంది. రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. చిరు 152వ చిత్రం సోషియో థీమ్‌తో తెర‌కెక్కనుంద‌ని, ఎండోమెంట్స్ విభాగం మరియు దేవాలయాల నిర్లక్ష్యం సమాజంపై ఎంత చెడు ప్ర‌భావం చూపుతాయో ఈ సినిమా ద్వారా చూపించ‌నున్నార‌ట‌. చిరు దేవాదయ ధర్మాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపిస్తారని టాక్. అంతేకాదు ఆలయ భూములను ఆక్రమించటానికి ప్రయత్నించే వారిపై అతను ఎలా చర్యలు తీసుకుంటాడు అనేది ఈ చిత్రానికి ప్రధాన కథాంశంగా తెలుస్తుంది. మ‌రి ఈ వార్త‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. నయనతార, అనుష్క పేర్లు వినిపించాయి. అయితే చిరంజీవితో గతంలో `స్టాలిన్` సినిమాలో నటించిన త్రిషను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇటీవల `96`తో తమిళంలో ఘనవిజయం అందుకున్న త్రిష.. తెలుగు సినిమా చేసి చాలా కాలమైంది. అయినప్పటికీ చిరంజీవి పక్కన త్రిష అయితే కరెక్ట్‌గా సరిపోతుందని దర్శకుడు కొరటాల భావిస్తున్నారట.

Related posts