telugu navyamedia
సినిమా వార్తలు

“కల్కి” ట్రైలర్ : ఏం సెప్తిరి ఏం సెప్తిరి… ఎప్పుడూ ఇలాగే సెప్తరా

Kalki

“యాంగ్రీ స్టార్” రాజశేఖర్ కథానాయకుడిగా శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా ‘కల్కి’. ‘అ!’ చిత్రంతో విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 1980 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఇందులో రాజశేఖర్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. విజువల్స్, నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు బావున్నాయని చిత్రబృందానికి ప్రశంసలు లభించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో ” ఏం సెప్తిరి ఏం సెప్తిరి… ఎప్పుడూ ఇలాగే సెప్తరా” అంటూ రాజశేఖర్ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. రాజశేఖర్ ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. ఎండింగ్ లో తన డ్యాన్స్ పై ధీటుగా సమాధానం చెప్పి యాక్షన్ సీన్ తో అదరగొట్టేశాడు. ఖర్మ అనే కాన్సెప్ట్ ను దర్శకుడు ప్రశాంత్ వర్మ వాడినట్లు అర్థమవుతోంది. మీరు కూడా ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

Related posts