telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏపీ ముఖ్యమంత్రిని కలవనున్న సినీ పెద్దలు ?

ys jagan cm

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే సినిమా పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంప్రదింపులు జరిపి షూటింగ్స్ కు అనుమతిని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా షూటింగ్ పర్మిషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి సినిమా పెద్దలు వెళ్లనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే జగన్ అపాయింట్ మెంట్ కోరగా.. అపాయింట్ మెంట్ కూడా లభించిందని తెలుస్తుంది. కాగా ఈ మీటింగ్ లో సినిమా షూటింగ్స్ కు అనుమతులు , ఏపీలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ మెంట్ వంటి అంశాలను చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక కరోనా కారణంగా ప్రతి డిపార్ట్ మెంట్ నుంచి ఇద్దరు మాత్రమే ఈ మీటింగ్ కు హాజరుకానున్నారట. కాగా ఎవరెవరిని తీసుకెళ్తారన్నదని పై స్పష్టత లేదు. ఈ మీటింగ్ కు నందమూరి బాలకృష్ణను ఆహ్వానిస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది.

Related posts