telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఊరి మీద ధ్యాస… ఆగిపోయిన శ్వాస…300 కిలోమీటర్లు కాలినడకన

దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కర్ఫ్యూ ప్రకటించారు. ప్రతి రాష్ట్రంలో వలసలకు వచ్చిన కూలీలు ఇప్పుడు సొంత ఊళ్లకు వెళ్లాలనుకుంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇంటికి చేరుకోవడానికి 200 కిలోమీటర్ల దూరం నడిచిన 38 ఏళ్ల వ్యక్తి శనివారం(28 మార్చి 2020) ఢిల్లీ-ఆగ్రా రహదారిపై చనిపోయాడు. రణ్‌వీర్ సింగ్ అనే యువకుడు మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలోని మారుమూల గ్రామంలో ఉన్న అతను తన ఇంటికి ఇంకా 100 కిలోమీటర్ల దూరం ఉండగా గుండెపోటుతో చనిపోయాడు. రణవీర్ సింగ్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం హాస్పిటల్‌కు పంపారు పోలీసులు. ఫార్మాలిటీ పూర్తయిన తర్వాత అతని కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు. రణవీర్ సింగ్ పనిచేస్తున్న దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలోని రెస్టారెంట్ మూసివేయడంతో అతను నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారని, ఆగ్రా జిల్లా పోలీసు చీఫ్ బాబ్లూ కుమార్ తెలిపారు. ప్రభుత్వ రవాణా సేవలలు.. బస్సులు మరియు రైళ్లను ప్రభుత్వం నిలిపివేయడంతో అతను 300 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రణ్‌వీర్‌తో పాటు మరో ఇద్దరు ఢిల్లీకి చెందినవారు మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలోని తన గ్రామం వైపు నడిచారు. వారు ఆగ్రా చేరుకునే సమయానికి రణవీర్ కి ఛాతీ నొప్పి రావడంతో ముగ్గురూ ఆగ్రా శివార్లలో ఆగిపోయారు. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్లు వచ్చేలోపు ఆయన చనిపోయారు. అతని ఫోన్ నుంచి పోలీసులు మరణించిన వ్యక్తి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. అతను మొరెనాలోని అంబా ప్రాంతంలోని బాడ్ కా పురా నివాసి.

Related posts